ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..మీరేం చేస్తుండ్రు: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

 ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..మీరేం చేస్తుండ్రు: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • నిద్రమత్తు వీడి.. రోడ్లను రిపేర్లు చేయండి 
  • ఆర్అండ్ బీ అధికారులపై కోమటిరెడ్డి  సీరియస్
  • ఇకనుంచి ప్రతివారం రివ్యూ చేయాలని ఆదేశం 

హైదరాబాద్: వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా నిర్లక్యం చేయడం ఎందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్అండ్ బీ ఆఫీసర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆర్అండ్ బీ అధికారులతో రివ్యూ మీటింగ్​అధికారుల తీరుపై మండిపడ్డారు.  నిద్రమత్తు వీడి..దెబ్బతిన్న రోడ్లను వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. 

మాటలు వద్దని రిజల్ట్​మాత్రమే కావాలని అధికారులపై ఫైర్​అయ్యాడు.  మీరేమో ప్రతి రివ్యూలో రోడ్లు బాగున్నాయని చెబుతారు..ప్రజలు రోడ్లు బాగాలేవంటు న్నారని..ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి..నివేదిక సిద్దం చేయాలని సూచించారు. 

ALSO READ : రాహుల్ మతం, కులమేంటి?: బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి

ప్యాచ్​వర్క్​ చేయడానికి ఇంత లేట్​ఎందుకు అవుతుందని ప్రశ్నించారు.  పార్ట్​హోల్స్​ నింపకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డారు.  అధికారుల పనితీరుపై ఇకపై ప్రతివారం రివ్యూ చేయాలని చీఫ్​సెక్రటరీ వికాస్​రాజ్​, స్పెషల్​సెక్రటరీ దాసరి హరిచందనను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.  ​