హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సోమవారం (నవంబర్ 11) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమర్తి లింగయ్యకు పోలీసులు ఇచ్చిన సమాచారం నాకు తెలియదన్నారు. గతంలో చిరుమర్తి లింగయ్య మా పార్టీలో గెలిచి తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లి ఆగం అయ్యాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితుడు ప్రభాకర్ రావు తెలంగాణకు రాకుండా అడ్డుపడుతున్నారని.. ఆయన వస్తే వీళ్ల జాతకాలన్నీ బయట పడతాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మేం లేకపోతే 11 నెలలు ప్రజలు బాధలో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు.. కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మా ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారన్నారని కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదు, ధరణి లేదని అన్నారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కూతుర కవిత జైల్‌కి పోతే ఒక్కరు కూడా పాపం అనలేదన్నారు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే జైల్‌కి పోయి యోగ చేస్తాడట.. అంటే ఇప్పుడు ఆయన ఫిట్‌గా లేడా అని సెటైర్ వేశారు. బచ్చగాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.