నల్లగొండ: దేవరకొండ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ది చెందిందంటే..అది కాంగ్రెస్ వల్లనే జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. గతంలో మేం దేవరకొండ ప్రాంత అభివృద్ధి కొరకు కొట్లాడి SLBC సొరంగ మార్గం చేపడితే దాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దేవరకొండ రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలలు కాకముందే హామీలపై ప్రశ్ని స్తున్నారు.. పదేళ్లు అధకారంలో ఉండి మీరు ఏం చేశారో చెప్పాలని బీఆర్ ఎస్ ను నిలదీశారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. క్రషర్ మిల్లుతో వందల ఎకరాల భూమిని సంపాదించుకున్నాడని ఆరోపించారు. బాలు నాయక్ కి ఇల్లు కూడా లేదన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంపీ అభ్యర్థులే లేరన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహిళా రిజర్వేషన్లకోసం ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నఎమ్మెల్సీ కవిత ..పదేళ్లు అధికారంలో ఉన్న మీ నాన్నం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ధర్నా చౌక్ తీసేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి మళ్లా ధర్నాచౌక్ పెట్టిండని గుర్తు చేశారు.
ALSO READ :- రైలు పట్టాలపై రైతులు ఆందోళన.. దేశ వ్యాప్తంగా రైల్ రోకో
నల్లగొండ ఎంపీగా రఘువీర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే.. అంతకంటే ఎక్కువ నిధులు వస్తాయని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రెండేళ్లలో దేవరకొండ నియోజకవర్గంలో రోడ్డు వేస్తాం.. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామన్నారు.దేవరకొండ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం.. ఇక్కడ పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారు.. ప్రభుత్వం తరపున అన్ని విధానాల వారిని ఆదుకుంటామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.