జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తాం : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

జీహెచ్ఎంసీని  నాలుగు  కార్పొరేషన్లుగా  విభజిస్తాం : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • పెరుగుతున్న జనాభా దృష్ట్యా నిర్ణయం
  • ప్రజా ప్రయోజనాల కోసమే డెసిషన్
  • 30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు
  • ట్రిపుల్ ఆర్ సగం తెలంగాణను కవర్ చేస్తది
  • మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం జనాభా రోజురోజుకూ పెరిగిపోతున్నదని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లు విభజించబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్ నోవాటెల్ లో నిర్వహించి అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ.. దాదాపు రూ. 30 వేల కోట్ల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని ఈ రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ గా మారబోతోందని చెప్పారు. ట్రిపుల్ ఆర్ సగం తెలంగాణను కవర్ చేస్తుందని, వచ్చే నవంబర్ టెండర్లు పిలుస్తామని వివరించారు.  వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు.