తెలంగాణ ప్రభుత్వం తరపున భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఓల్డ్ సిటీ నీ న్యూ సిటీ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
త్వరలో సిటీ లో నాలుగు పెద్ద హాస్పిటల్స్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉస్మానియా హాస్పిటల్ స్థానంలో నూతన హాస్పిటల్ ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. హైకోర్టును పునర్నిర్మించేదుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. R&B ద్వారా ఈ పనులన్నిటికీ బడ్జెట్ ను రిలీజ్ చేస్తామన్నారు. గత పదేళ్లలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలనలో భాగంగా ఇప్పటికే 11 లక్షల రైతు లకు రైతు రుణమాఫీ చేశామని వెల్లడించారు.