జనవరి 29 మంత్రులతో ముఖాముఖికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జనవరి 29 మంత్రులతో ముఖాముఖికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • 2 నెలల తర్వాత మళ్లీ స్టార్ట్ 

హైదరాబాద్, వెలుగు:గాంధీభవన్‌‌‌‌లో బుధవారం జరగనున్న 'మంత్రులతో ముఖాముఖి' కార్యక్రమానికి  ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరుకాను న్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. 

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వారంలో  రెండు రోజులు జరగాల్సిన ఈ ప్రోగ్రామ్.. మూన్నెళ్ల ముచ్చటగానే సాగింది. 

మూడు నెలల పాటు ఏదో రకంగా వారానికి ఒకసారి, 15రోజులకోసారి అన్నట్లు సాగిన ఈ ప్రోగ్రామ్​ చివరకు గత డిసెంబర్ 5తో ఫుల్ స్టాప్ పడింది. 2 నెలల తర్వాత మళ్లీ బుధవారం నిర్వహించనున్నారు. ప్రజలు, పార్టీ కేడర్ ఇందులో పాల్గొని, తమ సమస్యలను మంత్రి దృష్టికి వినతి పత్రాల రూపంలో  అందించాలని 
పీసీసీ కోరింది.