ఏపీ బిల్డింగుల వివరాలు రెడీ చేయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏపీ బిల్డింగుల వివరాలు రెడీ చేయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • అధికారులకు మంత్రి వెంకట్​ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏపీ సర్కారు ఆధీనంలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో రివ్యూ చేపట్టారు. హైదరాబాద్ లో ఆర్అండ్ బీ శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శ్ నగర్ లోని హాకా భవన్ , బషీర్ బాగ్, కుందన్ బాగ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్,  గ్రీన్ ల్యాండ్స్, మంజీర గెస్ట్ హౌస్ వంటి వివిధ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుగుణంగా పూర్తి సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీకి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ మధుసూధన్ రెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.