మహిళల అభ్యున్నతికోసం సంక్షేమ పథకాలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.నల్లగొండ జిల్లా  చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు. 

యువతులకు, ట్రాన్స్ జెండర్స్ కి స్వయం ఉపాధి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ల కు ప్రభుత్వం  ప్రోత్సాహకాలు అందిస్తుం ద న్నారు.  శిశు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.