నల్గొండ అర్బన్, వెలుగు : క్రీడా రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందుంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం అయన నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖే లో ఇండియా విమెన్ ఖోఖో స్టేట్ సెలక్షన్ ట్రయల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. గతంలో తెలంగాణకు ఈ క్రీడలలో సిల్వర్ మెడల్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ ఒలంపిక్స్ లో రాష్ట్రం ముందుండేలా చూస్తున్నదని చెప్పారు. ఆటో డ్రైవర్ కుమారుడైన టాప్ బౌలర్ సిరాజ్ కు ప్రభుత్వం తరఫున గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు, 500 గజాల స్థలాన్ని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలంపిక్స్ పథకాల్లో చివరి నుండి రెండో స్థానంలో ఉందని, సౌత్ కొరియా లాంటి చిన్న దేశం రెండు వందల మెడల్స్ సాధిస్తే మన దేశం రెండు మెడల్స్ సాధించడం బాధాకరమైన విషయం అని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఖేలో ఇండియా ఉమెన్ ఖో ఖో జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
12 వ బెటాలియన్ కు మంచి పేరు
రాష్ట్రంలో 12 బెటాలియన్ కు మంచి పేరు ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ లోని అన్నేపర్తి వద్ద ఉన్న 12 వ స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో నిర్వహించిన ఇంటర్ కాయ్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 3 రోజులుగా బెటాలియన్ లో నిర్వహించిన కబడ్డీ, క్రికెట్ ,వాలీబాల్ అథ్లెటిక్ పోటీలలో గెలుపొందిన వారికి మంత్రి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 12 వ బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య,12 వ బెటాలియన్ పోలీస్ అధికారులు, డీఎస్పీ శివరామిరెడ్డి,తహసీల్దార్ శ్రీనివాస్, తదితరులు ఈ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ కుహాజరయ్యారు