తెలంగాణలో జాతీయ రహదారులు, జిల్లాల్లో రోడ్లు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. గ్రేటర్ కమిషనర్ తో పాటు GHMC ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. సిటీ రోడ్ల లాగింగ్ పాయింట్లతో పాటు రోడ్ల రిపేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చేది వర్షం కావడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. సిటీలో ఉన్న పెండింగ్ ఫ్లైఓవర్లు, రోడ్లపై చర్చించినట్లు తెలుస్తోంది.
వర్షాకాలంతో పాటు హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో అలర్ట్ అయ్యింది ఆర్ అండ్ బీ శాఖ. హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను గుర్తించారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట టౌన్ లోని ఎస్వీ కాలేజ్, జనగాం క్రాస్ రోడ్, ఈనాడు జంక్షన్, దురాజ్ పల్లి జంక్షన్, మునగాల మండలం ముకుందాపురం, ఆకుపాముల, కోమరబండ, కటకొమ్ముగూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామాపురం ఎక్స్ రోడ్, నవాబ్ పేట జంక్షన్ ప్రాంతాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు రహదారుల శాఖ గుర్తించింది.
ప్రమాదాల నివారణకు ముఖ్యంగా సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం... జంక్షన్ డెవలప్ మెంట్స్, వెహిలకి ల్ అండర్ పాస్ ల నిర్మాణం, రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.