
కేటీఆర్ సూర్యాపేట లో ఏమి మాట్లాడాడో కనీసం ఆయనకైనా అర్థం అయ్యిందో కాలేదోనని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. SLBC ఘటనపై రాజకీయం చేయడం తగదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రారంభిస్తే.. బీఆర్ఎస్ పదేండ్లు పాలించి పూర్తి చేయలేకపోయింని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. BRS వల్లనే శ్రీశైలం ఎడమగట్టు కెనాల్ టన్నెల్ కూలిపోయిందని .. చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ ఎల్ బీ సీ విషయం లో సోమవారం (మార్చి 24) సీఎంతో మీటింగ్ సమావేశం అవుతామని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిషన్ భగీరథ, సాగునీరు, రహదారుల స్థితిగతులపై ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ | ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు.. ఆరు కేజీల సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్
ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముప్పై ఆరు సీట్లు గెలిచామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. నల్గొండ జిల్లా ప్రాజెక్ట్ లు తమ హయాంలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ చొరవతోనే శ్రీశైలం నుంచి రోజుకి ఐదు వేల టీఎంసీ నీళ్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేక పోవడం వల్లనే జగదీష్ రెడ్డి గెలిచారని, జగదీష్ రెడ్డి మంత్రి గా ఉన్నప్పుడు ఏ రోజు ప్రాజెక్ట్ గురుంచి పట్టించుకోలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో తాము చేసిన అభివృద్ధే కనిపిస్తోందని, జగదీశ్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు. మహాత్మ గాంధీ యూనివర్సిటీ ని తామే పూర్తి చేసినట్లు తెలిపారు.