
తెలంగాణ బట్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మంత్రి కోమటి రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య కాసేపు మాటల తూటాలు పేలాయి.
రుణమాఫీ, రైతుభరోసాపై ప్రభుత్వం విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి కోమటి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.రైతు భరోసా ఎప్పుడిచ్చారు,రుణమాఫీ ఎక్కడ చేశారు. ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చారు. గవర్నర్ 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్ధాలు చెప్పారు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అధికార పార్టీ నేతలు రన్నింగ్ కామెంట్రీ చేయడం మానుకోవాలని జగదీష్ రెడ్డి సూచించారు.
ALSO READ | జస్ట్ పలరించుకున్నామంతే.. కేసీఆర్ను కలవడంపై మంత్రి తుమ్మల క్లారిటీ
జగదీష్ రెడ్డి కామెంట్స్ కు మంత్రి కోమటి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దళితుడిని సీఎం చేస్తామని బీఆర్ఎస్ చేసిందా? మూడెకరాల భూమి ఇస్తామని ఇచ్చిందా?ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పూర్తి చేసినవేనన్నారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం. మీరు పదేళ్లలో చేయలేనిది..తాము 14 నెలల్లో చేశామన్నారు కోమటిరెడ్డి.