
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే విమర్శిస్తావా అని కేసీఆర్ ప్రశ్నించారు కోమటిరెడ్డి. కేసీఆర్ పదేండ్లలో 10 వేల అబద్దాలు ఆడారని విమర్శించారు కోమటిరెడ్డి. ఏ మోహం పెట్టుకుని కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ దేవత అని కేసీఆర్ గతంలో అనలేదా ? అని ప్రశ్నించారు.
సోనియా కాళ్లు మొక్కిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారుకోమటిరెడ్డి. పదేండ్లలో కేసీఆర్ అక్రమంగా 10 లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు . కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారులు కొందరు జైల్లో ఉంటే మరి కొందరు అమెరికాలో ఉన్నారని విమర్శించారు. తాము అబద్దాలు చెప్పి ఉంటే ఎప్పుడో అధికారంలోకి వచ్చే వాళ్లమన్నారు. మేం తల్చుకుంటే బీఆర్ఎస్ కంటే తలదన్నే మీటింగ్ పెట్టగలమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మరో దశాబ్ధం నల్గొండ కాంగ్రెస్ దే
మరో దశాబ్ధం నల్గొండ కాంగ్రెస్ దేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అభివృద్ధి విషయంలో తాము ఎక్కడా రాజీపడబోమన్నారు. నల్గొండకు రూ. 700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామనిచెప్పారు ఉత్తమ్.