
తెలంగాణ ఉద్యమంలో కొండా బాపూజీ లక్ష్మణ్ సేవలు మరవలేనివని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. .ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్ డ్రామా దీక్ష చేశారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు కేసీఆర్ కు ఏనాడు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని ఆయన అన్నారు. కేసీఆర్ కంటే ముందే చాలా మంది తెలంగాణ కోసం పోరాడారన్న మంత్రి ... రాష్ట్ర ఏర్పాటె ఆవశ్యకత గురించి సోనియాగాంధీకి వివరించామన్నారు. కేసీఆర్ డ్రామాలతో అమాయక యువత చనిపోయిందన్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణను ప్రకటించిన దేవత సోనియాగాంధీ అన్నారు.
గొర్రెల పంపిణీలో స్కాం జరిగిందని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామన్నారు, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారన్నారు. మంత్రి పదవి రాలేదని కేసీఆర్ మళ్లీ ఉద్యమం చేశారన్నారు.