
మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇన్నాళ్లూ ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకున్న కేసీఆర్.. అనర్హత వేటు పడుతుందనే రేపు (మార్చి 12) అసెంబ్లీకి వస్తున్నారని మండిపడ్డారు. తూప్రాన్ లో స్కూల్ బస్సు ప్రమాదం జరిగి విద్యార్థులు చనిపోతే సీఎం హోదాలు కనీసం పిల్లలని చూడటానికి కూడా కేసీఆర్ రాలేదని, అలాంటి కేసీఆర్ కు విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి చేసిన హాట్ కామెంట్స్:
కేసీఆర్ దొంగ దీక్షలు చేశారు
కొండగట్టు బస్సు యాక్సిడెంట్ జరిగి ప్రజలు చనిపోతే కేసీఆర్ వెళ్ళలేదు
కానీ ఇంట్లో కుక్క చనిపోతే మాత్రం డాక్టర్ నే సస్పెండ్ చేశారు
కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నాము..
10 ఏండ్లు తెలంగాణలో అధికారంలో ఉంటాం
రైతులు బోనస్ ఇచ్చాము ఆనందంలో అన్నారు..
దేశంలో ఎవరు ఇప్పటివరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు
మోడీ రూ.15 లక్షలు ప్రజల అకౌంట్ లో వేస్తామని అన్నారు
2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన కేబినెట్ లో ఎలాంటి గొడవ జరగలేదు.
బీజేపీ మహేశ్వర్ రెడ్డి ఏ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.
సీఎం గా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారు.. మార్పు అనేది ప్రచారమే.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాము..
రాష్ట్రంలో అందరూ ఇప్పుడు సన్న వడ్లు వేశారు.
ఒక్క నిజామాబాద్ రైతులకు సన్న వడ్లకు 95 కోట్ల రూపాయల బోనస్ వచ్చింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిని నిలబెట్టలేదు.
బీజేపీని గెలిపించేందుకు అభ్యర్థిని నిలబెట్టలేదు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి ప్రచారం చేశారు.
భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండదు.. బ్రహ్మ దేవుడు వచ్చినా ఆ పార్టీని కాపాడలేరు.
బీసీ కులగణన పై మాట్లాడే హక్కు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితకు లేదు.
కులగణనలో పాల్గొనని వారికి మాట్లాడే హక్కు ఎక్కడిది..?..