మన్నెగూడ హైవే పనులు స్పీడప్ చేయండి..ప్రాజెక్టు డైరెక్టర్​కు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నేషనల్ హైవే పనులు స్పీడప్ చేయాలని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరావు తో ఆయన ఫోన్ లో మాట్లాడారు.  ఎక్కువ మిషన్లతో వర్క్ స్పీడప్ చేశామని మంత్రికి పీడీ తెలిపారు.

తాను ఇప్పటికే టెండర్ దక్కించుకున్న మేఘా కంపెనీ కృష్ణారెడ్డితో మాట్లాడానని మంత్రి పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. వర్క్ జరగటం లేదని అసెంబ్లీలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అబద్దాలు చెబుతున్నారని, కావాలంటే ఫీల్డ్ కు వెళ్లి పనులు చెక్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.