బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో డిపాజిట్ రాలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంటకట్ రెడ్డి. మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారు.. పదిహేనేళ్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత పాలనపై దృష్టి పెట్టామన్నారు.
హైదరాబాదుకు త్రాగునీరు అందించేందుకు మల్లన్న సాగర్ నుంచి నీరు తీసుకొచ్చే పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. మూసి ప్రక్షాళనపై ముఖ్యమంత్రి దృష్టి సాధించారన్నారు. త్వరలో అది పూర్తి అవుతుందన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అయిపోతుందని చెప్పారు.
4 వేల 500 కోట్లతో హైదరాబాద్, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే సెప్టెంబర్ లో టెండర్లు పిలుస్తున్నామని.. ఉప్పల్, ఘట్కేసర్ ఫ్లైఓవర్ పాత టెండర్ రద్దుచేసి గడ్కరితో మాట్లాడి కొత్త టెండర్ నెలరోజులు లోపు పిలుస్తాని వెల్లడించారు. యాదగిరిగుట్ట ఆలయానికి భాస్కర్ రావు అనే అధికారిని పెట్టి ఆరు నెలల్లో భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచాము.