నేడు డీసీసీబీ చైర్మన్​ ఎన్నిక..హాజరుకానున్న మంత్రి

నల్గొండ, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కొత్త చైర్మన్​ను సోమవారం ఎన్నుకోనున్నారు. ఉదయం 9 గంటలకు డీసీసీబీలో చైర్మన్ ఎన్నిక జరుగుతుందని డీసీవో కిరణ్​తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు పాల్గొంటారు. కొత్త చైర్మన్​గా డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడైన శ్రీనివాస్ రెడ్డి వైపు మెజార్టీ డైరెక్టర్లు మొగ్గుచూపుతున్నారు. మొత్తం 19 మంది డైరెక్టర్లలో 15 మంది శ్రీనివాస్​రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. మూడు రోజులపాటు ఇన్​చార్జి చైర్మన్​గా ఉన్న వైస్​ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్​రెడ్డి తిరిగి తన బాధ్యతలను కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్​కు అప్పగిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పవర్​లో ఉంటుంది.