రోడ్ల పనులను స్పీడప్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి

  • పనుల్లో ఎక్కడా నెగ్లెట్​కావొద్దు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 
  • అధికారులతో రివ్యూ మీటింగ్​ 

హైదరాబాద్: ​ నేషనల్​హైవే రోడ్ల నిర్మాణంలో స్పీడప్​చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. నేషనల్​హైవే రోడ్ల నిర్మాణంపై ఇవాళ అధికారులతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు.  రాష్ట్రంవ్యాప్తంగా  నేషనల్​ హైవే పనులపై ఆరా తీశారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  రోడ్లు పనుల్లో జాప్యం జరుగడంపై  అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  త్వరలోనే సీఎంతో చర్చించి భూసేకరణపై కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.  ఎక్కడా ఆలస్యం కాకుండా పనుల్ని ఎప్పుటికప్పుడు కంప్లీట్​చేయాలన్నారు.

ALSO READ | లక్నవరం ఊటీ, సిమ్లాలను తలపిస్తుంది : జూపల్లి

సమస్యలపై కిందిస్థాయి అధికారులతో వారం రోజులకు ఒకసారి మీటింగ్​నిర్వహించాలన్నారు.  పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా తనిఖీలు చేపట్టాలన్నారు.  ప్రజలకు పదికాలాల పాటు క్వాలిటీతో రోడ్లు సౌకర్యాలను అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు. 

ఎన్.హెచ్-163 జీ (విజయవాడ - నాగ్ పూర్), ఎన్.హెచ్ 765 (హైదరాబాద్ – డిండి),  ఎన్.హెచ్ 365బీజీ  (ఖమ్మం – దేవరపల్లి), ఎన్.హెచ్-151 సీ (కర్నూల్ – రాయచూర్), ఎన్.హెచ్-65 (హైదరాబాద్ – విజయవాడ) ఎన్.హెచ్-44 (2 ప్యాకేజీలు(1) హైదరాబాద్ – నాగపూర్ (2) హైదరాబాద్ – బెంగళూర్ అండ్) నిర్మాణాలపై  అధికారులతో  రివ్యూ కొనసాగుతుంది.