- వచ్చే నెలలో మెగా డీఎస్సీ
- గందమల్ల ప్రాజెక్టును పూర్తి చేస్తం
భువనగిరి : బీఆర్ఎస్ నేతల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు ఆరు నెలల్లో బీఆర్ఎస్ నేతలు తీహార్ జైల్లో ఉంటారని అన్నారు. కేటీఆర్ కారు సర్వీసింగ్ కి పోయిందని అంటున్నారని, కానీ కారు సర్వీసింగ్ కు కాదు ఫిట్ నెస్ అయిపోయి స్క్రాప్ కింద షెడ్డుకు పోయిందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే నెలలో మెగా డీఎస్సీ వేసి టీచర్ల పోస్ట్ లను భర్తీ చేస్తామన్నారు. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గనికి వచ్చిన మొదటిసారి 100 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.