పదేండ్లు పవర్‎లో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే: మంత్రి కోమటిరెడ్డి ఫైర్

పదేండ్లు పవర్‎లో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే: మంత్రి కోమటిరెడ్డి ఫైర్

పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, మేము ఇస్తుంటే ప్రతి పక్షాల కండ్లు మండి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆధిబట్ల మునిపాలిటీలో రూ.25కోట్ల నిధులతో నిర్మించనున్న రోడ్డు  శంకుస్థాపన పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మునిసిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్హునికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. 

ALSO READ | మేం గాజులు తొడుక్కొని కూర్చోలే.. సరైన రీతిలో బుద్ధి చెబుతాం: MLA మహిపాల్ రెడ్డి

ఇక నుండి పేదలకు సన్న బియ్యం ఇస్తామన్నారు. గత పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని గత ప్రభుత్వ మంత్రులు ఇప్పుడు కండ్లు మండి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వనున్నాం. రేషన్ కార్డులు లేనివారికి ఇవ్వాలని క్యాబినెట్ లో 40 లక్షల వరకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. 15 రోజుల తర్వాత ప్రతిపక్షాలు ఎవరూ నోరు తెరవరు. రాష్ట్రంలో పేదవారు దరఖాస్తు ఇస్తే రేషన్ కార్డు క్షణంలో ఇచ్చేవిదంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియగా కొనసాగుతోందని తెలిపారు. ఇబ్రహీంపట్నాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు.