
సూర్యాపేట: పెద్దగట్టు లింగమంతుల స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం (ఫిబ్రవరి 19) దురాజ్ పల్లి లింగమంతుల స్వామి వారిని మంత్రి కోమటిరెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
దర్శనం అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెద్దగట్టు ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.80 కోట్లు అవసరమయిన మంజూరు చేస్తామన్నారు. వయసు పైబడిన భక్తులకు గుట్టు ఎక్కడం కష్టంగా మారిందని.. వచ్చే జాతర నాటికి ఘాట్ రోడ్డు, విశ్రాంతి భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఏడాదిలోనే పెద్దగట్టు పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభిస్తామని అన్నారు.
ALSO READ | ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. వరద సాయం నిధులు రిలీజ్
ఇక, మంగళవారం పెద్దగట్టుకు వచ్చి.. రైతులకు నీరివ్వని కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. రైతుల ఉసురు తగలేది కాంగ్రెస్కు కాదని.. రైతుల ఉసురు తగిలే కేసీఆర్ మంచానికి పడ్డారు.. కవిత జైలు పాలయ్యారని కౌంటర్ ఇచ్చారు.