సీఎం రేవంత్ రెడ్డిని ఎదురుకునే దమ్ము కేసీఆర్కు లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  నల్గొండలో  మార్చి 06 బుధవారం రోజున మీడియా సమావేశం నిర్వహించిన  మంత్రి బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండడం డౌటేనని బీజేపీలోకి పోతాడని ఆరోపించారు. హరీష్ బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు.  

గడిచిన పదేళ్లలో కేసీఆర్  తెలంగాణను సర్వ నాశనం చేశాడన్నారు మంత్రి కోమటిరెడ్డి. కోట్లాది రూపాయల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని వందేళ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదురుకునే దమ్ము లేక అసెంబ్లీ రావడం లేదని విమర్శించారు.  బీఆర్ఎస్ లాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పోతే ఆ  పార్టీలో మిగిలేది నలుగురే మాత్రమేనన్నారు.  

రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రధాని మోడీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి.  తెలంగాణలో 14 ఎంపీ  సీట్లు గెలుస్తామని చెప్పారు. కేసీఆర్ దిక్కు లేక అర్ ఎస్ ప్రవీణ్ కుమార్  కాళ్ళు పట్టుకునే  పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎల్ ఆర్ ఎస్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదన్న మంత్రి...  దీనిపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు.  

Also Read : కొత్త రూటులో షంషేర్‌గంజ్, జంగమెట్ మెట్రో స్టేషన్లు లేవు