- ఎల్పీ సెక్రటరీ కూడా కాదు..
- ఏ హోదాలో మాట్లాడుతున్నవ్
- మీ ప్రతిపక్ష నాయకుడెక్కడున్నరు
- నువ్వో సాధారణ ఎమ్మెల్యేవే..?
- నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది
- హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
హైదరాబాద్: హరీశ్ రావు డిప్యూటీ లీడరా..? లేక ఎమ్మెల్యేనా..? ఆయన ఏ హోదాలో మాట్లాడుతున్నారో క్లారిటీ కావాలని మంత్రి కోమటిరెడ్డి సభలో ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఏడాదిగా సభకు రావడం లేదని, అది సభకే కాదు, తెలంగాణ ప్రజలను కూడా అవమాన పర్చడమేనని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు అడిగే హక్కు లేదంటూ ఫైర్ అయ్యారు. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ALSO READ | ఫార్ములా ఈ - కార్ రేసింగ్ కేసు ఏంటీ.. కేటీఆర్ చేసిన తప్పేంటీ..?
ఆయన డిప్యూటీ లీడర్ కాదని, కనీసం ఎల్పీ సెక్రటరీ కూడా కాదని, సాధారణ ఎమ్మెల్యే హోదాలో నల్లగొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు హరీశ్ రావుకు ఎక్కడిదని అన్నారు. తాను మొన్నటి నుంచి గమనిస్తున్నానని, ప్రతి దానికీ హరీశ్ రావు ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పానని అన్నారు. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు కనికరం లేదని అన్నారు. తాము ఎస్‌ఎల్‌బీసీ సొరంగం 70 శాతం పూర్తిచేశామని చెప్పారు. హరీశ్ రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్‌రావు ఒక్కసారీ సొరంగం వద్దకు రాలేదని విమర్శించారు.
మూసీ పై చర్చ
ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 70శాతం పూర్తిచేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
పదేళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పు చేసినా దీన్ని పూర్తిచేయలేదన్నారు. తమ ప్రభుత్వం గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 40లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరులశాఖ మంత్రి ఉత్తమ్‌ను కోమటిరెడ్డి కోరారు.