హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..తిరిగి సొంతగూటికి చేరుతున్నారని వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. చాంబర్ కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా నా చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారాు. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని అన్నారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు.. ఆయన ఎక్కడికి వెళ్లడు అని గట్టిగా చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నారు.. సీఎంరేవంత్ రెడ్డి ఫారిన్ వెళ్లే నేను ఉన్నాగా చూసుకోవడానికి .. బీఆర్ ఎస్ నేతలకు నేను చాలు అని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో ప్రధానిని కలుస్తా.. రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా అన్నారు. బీఆర్ ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ఇస్తామన్నారు.
ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్ పిలుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మత్తు పనులు చేపడతామన్నారు. ఎస్ ఎల్ బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
అసెంబ్లీలో ప్రతి పక్ష పాత చాలా కీలకమైనది.. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారు. కేసీఆర్ కు ప్రజలమీద ప్రేమ లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారు అని అన్నారు.