విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి  : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం రూపొందించిన రిపోర్ట్ ను ఆదివారం హైదరాబాద్​లో మంత్రికి ఫోరం చైర్మన్ ఎంవీ గోనారెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్​మెంట్ ఫోరం సమగ్ర సమాచారం రూపొందించడం అభినందనీయమన్నారు. అనంతరం భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్, కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డిని కలిసి ఫోరం రిపోర్టును అందజేశారు.