యాదాద్రి భువనగిరి:రైతుల బాగు కోసమే మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమయ్యారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. యాదగిరిగుట్ట మండలం జంగంపల్లిలో బస్వాపూర్ కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. రైతు భరోసా, మిగిలిన రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామన్నారు. 15వందల కోట్లతో కేసీఆర్ మల్లన్న సాగర్ కడితే ఆలేరుకు చుక్క నీరుకూడా రాలేదన్నారు. గంధమల్ల చెరువుకు రెండు నెలల్లలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు కోమటిరెడ్డి.
Also Read : నాటు బాంబు, లక్ష్మీ బాంబు కాదు ఆటమ్ బాంబ్ పేలబోతుంది
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకే బస్వాపూర్ కాలువ ద్వారా నీటిని విడుదల చేశామన్నారు.రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మల్లన్నసాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ నింపి మూసీ పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించే ఉద్దేశ్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి మూసీప్రక్షాళన చేపట్టారన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.