మున్సిపల్​ పార్కులో మంత్రి ప్రజాదర్బార్

నల్గొండ, వెలుగు : రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్​పార్కులో ప్రజా దర్బార్​ నిర్వహించారు. శనివారం మంత్రి క్యాంప్​ఆఫీస్ సమీపంలోని మున్సిపల్​పార్కులో మంత్రి కుర్చీ వేసుకుని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమేగాక, తక్షణమే అధికారులకు ఫోన్​చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ గౌడ్, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.