నల్గొండ రైతుల ఉసురు తగిలే బీఆర్‌ఎస్‌ పతనం : కోమటిరెడ్డి వెంకట్ ‌‌రెడ్డి

నల్గొండ రైతుల ఉసురు తగిలే బీఆర్‌ఎస్‌ పతనం : కోమటిరెడ్డి వెంకట్ ‌‌రెడ్డి
  • వడ్లు కొన్న మూడు రోజుల్లోనే అకౌంట్ ‌‌లో డబ్బులు వేస్తాం
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ‌‌రెడ్డి
  • నల్గొండలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

నల్గొండ అర్బన్, వెలుగు : ఎల్ ‌‌ఎస్ ‌‌బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ‌‌ పూర్తి చేయకపోవడంతో నల్లొండ జిల్లా రైతుల ఉసురు తగిలే బీఆర్ ‌‌ఎస్ ‌‌ పాలన అంతమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ‌‌రెడ్డి అన్నారు. నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన దొడ్డు రకం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు ఒకేసారి రూ. 18 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. 

రూ. 2 లక్షల కన్నా ఎక్కువగా ఉన్న రుణాలను సైతం పది రోజుల్లో మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మూడు రోజుల్లోనే వారి బ్యాంక్ ‌‌ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ ‌‌ చేస్తామన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, చెల్లింపులు ఆలస్యమైనా సివిల్ ‌‌ సప్లై ఆఫీస్ ‌‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ‌‌ నంబర్ ‌‌ 99634 07064కు ఫోన్ ‌‌ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ‌‌ ఇస్తుందన్నారు. జనవరి నుంచి రేషన్ ‌‌ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

ఎస్ ‌‌ఎల్ ‌‌బీసీ పనులను డిసెంబర్ ‌‌లో మొదలు పెట్టి రెండేండ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని కులాలకు చెందిన స్టూడెంట్ల కోసం ఇంటిగ్రేటెడ్ ‌‌ హాస్టల్స్ ‌‌ కట్టిస్తున్నామని, మొదటి విడత కింద 20 నియోజకవర్గాలలో ఈ నెల 11న శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. వడ్ల కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

సమావేశంలో అడిషనల్ ‌‌ కలెక్టర్ ‌‌ శ్రీనివాస్ ‌‌, సింగిల్ ‌‌ విండో అధ్యక్షుడు నాగరత్నం రాజు, మున్సిపల్ ‌‌ చైర్మన్ ‌‌ బుర్రి శ్రీనివాస్ ‌‌రెడ్డి, సివిల్ ‌‌ సప్లై ఆఫీసర్ ‌‌ వెంకటేశ్వర్లు, మేనేజర్ హరీశ్ ‌‌, వ్యవసాయ శాఖ జేడీ శ్రవణ్, మార్కెటింగ్ ‌‌ శాఖ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీవో శేఖర్ ‌‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ ‌‌నాయక్‌‌, కాంగ్రెస్ ‌‌ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ ‌‌రెడ్డి పాల్గొన్నారు.