నల్గొండ మున్సిపాలిటీని రాష్టంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రూ. 600 కోట్లతో చేపట్టే నల్గొండ అవుటర్ రింగ్ రోడ్డు పనులకు (ఏప్రిల్) వచ్చే నెలలో టెండర్లును పిలవనున్నామని చెప్పారు. ఆరులైన్ల రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. రోడ్లు, డ్రైన్ల పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు హాజరైన.. 12 వేల మందిలో 6 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. మే నెలలో మరోసారి జాబ్ మేళా నిర్వహస్తామని ... నిరుద్యోగులు ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి చందన దాసరి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.