మామ చాటు అల్లుడిగా హరీష్ రావు రూ.10 వేల కోట్లు దోచుకుండు: మంత్రి కోమటిరెడ్డి

మామ చాటు అల్లుడిగా హరీష్ రావు రూ.10 వేల కోట్లు దోచుకుండు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ సాగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు కమిషన్లు తీసుకున్నారు.. ఈ ఆరోపణలు నేను నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు. నేను ఎక్కడైనా కమిషన్లు తీసుకున్నట్లు హరీష్ రావు నిరూపిస్తే.. నేను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మామ చాటు అల్లుడిగా హరీష్ రావు రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 

Also Read:-మాట ఇచ్చాం.. ధరణిని బంగాళాఖాతంలో పడేశాం..

హరీష్ రావుకు దబాయించడమే వచ్చని.. ఆయనకు పని చేయడం రాదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి బాగోలేదని.. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. తన పేరును నేరుగా ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి ఆరోపణలు చేశారని.. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు.