హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం (అక్టోబర్ 22) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఒక జోకర్ అంటూ సెటైర్లు వేశారు. విద్యుత్ చార్జీల పెంపు అంశంపై కేటీఆర్ ఈఆర్సీ దగ్గరికి వెళ్లడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు.
మరోవైపు బీజేపీ కీలక నేతలు, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమి లేదని అన్నారు. తెలంగాణకు కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో ఒకే దగ్గర తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ నిర్మిస్తామని తెలిపారు. తద్వారా టైమ్ సేవ్ అవుతోందని పేర్కొన్నారు.
ALSO READ | గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసింది