నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వేరేశం ఆలయ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను మంత్రి వెంకట్ రెడ్డి అందజేశారు.
చెర్వుగట్టు రాష్ట్ర పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని రామలింగేశ్వరుని కోరుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి తెలిపారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత BRS ప్రభుత్వం 10సంవత్సరాల పాలనలో చెర్వుగట్టు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ చెర్వుగట్టుకి పలుమార్లు వస్తా అని.. వచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని చెర్వుగట్టుకి తీసుకొచ్చి దేవస్థానం ని భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేస్తారని తెలిపారు.
చెర్వుగట్టుకి వచ్చే రెండు రోడ్లను, గుట్టపైకి వచ్చే రోడ్లను విస్తరిస్తామని వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని వసతి గృహాలని నిర్మాణము చేపడుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి పేర్కొన్నారు.