రేసు మొనగాడు దీక్షలు చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రేసు మొనగాడు దీక్షలు చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు :  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్ నల్గొండ జిల్లా పర్యటనపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు . నల్గొండ జిల్లా రైతులకు ఏం అభివృద్ది చేశారని జిల్లా పర్యటిస్తారని  ప్రశ్నించారు.  జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నాయకులు నల్గొండ జిల్లాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. రేసులలో తిరిగే మొనగాడు జిల్లాకు వచ్చి దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరని ధ్వజమెత్తారు.  కేటీఆర్ దీక్షలు చేసిన, ప్లెక్సీలు పెట్టినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. నల్గొండ జిల్లాకు వచ్చే ముందు సిరిసిల్లలో నీకు వచ్చిన మెజార్టీ గుర్తు చేసుకోవాలని  కేటీఆర్ కు సూచించారు. దోపిడీలు చేశారు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీ కాదు .. బొందలగడ్డ పార్టీ అని ఫైర్ అయ్యారు. 

పనికి రానివల్లను 10 ఏండ్లు మంత్రిని చేశారని ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తనను ఓడగొట్టడం కోసం  నల్గొండ జిల్లాను దత్తతకు తీసుకుంటానని మాయ మాటలు చెప్పారని మండిపడ్డారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయల సీమ వాళ్లకు నీళ్ళు తీసుకెళ్ళారని ఆరోపించారు. 10 ఏళ్లలో అభివృద్ది చేయకుండా లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. జిల్లాలో ఫ్లోరైడ్ ఇంకా ఉందన్నారు.