ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై హరీశ్‌‌ రావే సిట్‌‌ వేయాలన్నడు : కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి 

ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌పై హరీశ్‌‌ రావే సిట్‌‌ వేయాలన్నడు : కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి 
  •     మామ, బావమరిది మీద కోపంతో అలా అన్నాడేమో: కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) టెండర్‌‌‌‌పై అసెంబ్లీలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌ రావే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి గుర్తుచేశారు. ఆయనకు వాళ్ల మామ మీదనో, బామ్మర్ది మీదనో కోపం ఉందని, అందుకే విచారణకు డిమాండ్ చేశారని ఎద్దేవా చేశారు. టెండర్‌‌‌‌పై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారని చెప్పారు. ఆదివారం హైదరాబా ద్‌‌ అబిడ్స్‌‌లోని రెడ్డి హాస్టల్స్ మొదటి అలుమినీ మీటింగ్‌‌లో మంత్రి వెంకట్‌‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో రూ.6,500 కోట్లు లోన్ తెచ్చి ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ను నిర్మిస్తే, ఎన్నికల ముందు బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం రూ.7,300 కోట్లకు లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఓఆర్ఆర్‌‌‌‌తో తెలంగాణ స్వరూపమే మారిందన్నారు. ఫార్ములా–ఈ -రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ పనులు మార్చిలో ప్రారంభించి, మూడేండ్లలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. రెడ్డి హాస్టల్ అలుమినీ చైర్మన్‌‌గా తనను ఎన్నుకున్నందుకు కమిటీకి మంత్రి వెంకట్‌‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.