
- 8 మందిని కాపాడేందుకు ఎంతో కష్టపడుతున్నం: మంత్రి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. లోపల చిక్కుకుపోయిన 8 మందిని కాపాడే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గాంధీ భవన్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ప్రమాద స్థలంలోనే ఉండి అందరినీ సమన్వయం చేస్తుంటే.. ఆయన్ను హెలికాప్టర్ మినిస్టర్ అంటున్నరు. ఉత్తమ్ టన్నెల్ వద్దే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నరు. 8 మందిని కాపాడేందుకు ఉత్తమ్ అంత కష్టపడుతుంటే ఆయన్ను బద్నాం చేయడం ఎంత వరకు కరెక్ట్?’’అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.