అభివృద్ధి కొనసాగాలంటే ..స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అభివృద్ధి కొనసాగాలంటే ..స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నే గెలిపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • ఆర్ అండ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
  • ప్రమాదాల నివారణకు ఫ్లై ఓవర్ల నిర్మాణం 
  • రైస్ ఇండస్ట్రీస్ ఏర్పాటులో మిర్యాలగూడకు ప్రత్యేక గుర్తింపు 
  • యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను త్వరలో పూర్తి చేస్తాం

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి, నార్కెటపల్లి హైవేపై రామచంద్ర గూడెం వై జంక్షన్ సహా నందిపాడు, చింతపల్లి, ఈదుల గూడ బైపాస్ లపై చేపట్టనున్న అండర్ పాస్ నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు.

మహాబూబాబాద్ జిల్లా వరద బాధితులకు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పంపుతున్న 30 టన్నుల బియ్యం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, మిర్యాలగూడ హైవే పై క్రాసింగ్ ల వద్ధ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రమాదాల నివారించేందుకు అండర్ పాస్ నిర్మాణాలను త్వరలో పూర్తి చేస్తామన్నారు. బియ్యం ఉత్పత్తి, ఎగుమతుల్లో మిర్యాలగూడకు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ పనులను కొద్ది నెలల్లో కంప్లీట్ చేస్తామ న్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాంతాన్ని వరి సాగుకు కేరాఫ్ గా మార్చిందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ ఎడమ కాల్వ లైనింగ్​ను పూర్తిచేసినట్లు తెలిపారు. ఎస్​ఎల్​బీసీ పనులను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని, తాము అధికారం చేపట్టిన కొద్ది నెలలకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించామని చెప్పారు. అమృత్ స్కీం కింద రూ. 316 కోట్ల నిధులను తెచ్చామన్నారు.

ఇటీవల ఓడిపోయిన మిర్యాలగూడ ఎమ్మెల్యే మళ్లీ సర్పంచ్ గా కూడా గెలవలేడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు అవసరమైన నిధులను కేటాయించిందనిఒ మిర్యాలగూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ క్లియో అరేనా స్టేడియంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవంలో మంత్రి, ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కేతావత్ శంకర్ నాయక్, కలెక్టర్ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఈఎన్ సీ మధుసూదన్ రెడ్డి, క్యూబ్ హైవే స్ చైర్మన్ కృష్ణారెడ్డి ఉన్నారు.