జగదీశ్​రెడ్డి సస్పెన్షన్​ను ఎత్తివేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

జగదీశ్​రెడ్డి సస్పెన్షన్​ను ఎత్తివేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • త్వరలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటు: మంత్రి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ఎమ్మెల్యే​జగదీశ్​ రెడ్డిపై సస్పెన్షన్​ను ఎత్తివేయబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఆయనపై అనర్హత వేటు వేసే అంశాన్ని పరిశీలించేందుకు త్వరలో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చిట్ చాట్ చేశారు.

జగదీశ్​ రెడ్డి పై 3 మర్డర్ కేసులు ఉన్నాయని, వాటిని  తెరిచి జైలుకు పంపిస్తామోననేభయంతో ఇటీవల ఏడ్చారని, అంతే తప్ప రైతుల సమస్యలు, నీళ్ల కోసం కాదని ఎద్దేవా చేశారు. హరీశ్​ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదు.. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా కాదని  అన్నారు. ఈ పదవి కోసం బీఆర్ఎస్​లో పోటీ అధికంగా ఉందని చెప్పారు.