హైదరాబాద్: పనులు మొదటి పెట్టి ఆరేండ్లయినా ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేయకుండా గత బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పదేళ్లు అధికారంలో ఉండి.. హైదరాబాద్ ను విశ్వనగరంలగా చేస్తామని చెప్పి.. అరేళ్లయినా ఉప్పల్ ఫ్లై ఓవర్ ను పూర్తి చేయనందుకు కేసీఆర్, కేటీఆర్ సిగ్గుపడాలన్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పై ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పార్లమెంట్ లో పదిసార్లు అడిగారన్నారు.
ఉప్పల్ ఫ్లైఓవర్ కు మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఫ్లైఓవర్ నిర్మాణానికి 200 నుంచి 500 కోట్లు అవుతుందన్నారు. 10 రోజుల్లో ఉప్పల్ చౌరస్తానుంచి ఘట్ కేసర్ వరకు రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. ఫ్లైఓవర్ పనులు దసరానాటికి ప్రారంభిస్తామన్నారు. 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేస్తామన్నారు.
కమీషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డిసెంబర్ లో మూసీ పనులు మొదలు పెడతామన్నారు. సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికోసమే బీఆర్ ఎస్ లో చేరిందన్నారు.
మరోవైపు నవంబర్ 1 న అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామన్నారు. దీంతో పాటు 3 నెలల్లో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారి 6 లైన్ల రోడ్ పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి