
కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజాపాలనలో ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లను తీసు కొచ్చామన్నారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న SLBC సొరంగం పూర్తికి కట్టుబడి ఉన్నామన్నారు. అంతేకాదు.. గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యా మ లం చేస్తుందన్నారు.
ప్రజాపాలనలో సీతారామ ప్రాజెక్టుతో పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 3లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. ఎన్నికల్లో తెలంగాణ రైతులుకు ఇచ్చిన మాట ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షలలోపు రుణమాఫీ చేస్తుందన్నారు.
గురువారం ఆగస్టు 15 నాడు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌజ్ లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మొదటి పంప్ హౌజ్ ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించగా.. ములకలపల్లి మండలం కమలాపూరం వద్ద మూడో పంప్ హౌజ్ ను డిప్యటీ సీఎం భట్టి ప్రారంభించారు.
పూసుగూడెం వద్ద రెండో పంప్ హౌజ్ ను సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టును 2026 ఆగస్టు 15 వరకు పూర్తి చేసి గోదావరి జలాలను జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాలకు తరలించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.