కొత్తగూడెం,రామగుండం ఎయిర్ పోర్టులకు లైన్ క్లియర్ : కోమటిరెడ్డి

కొత్తగూడెం,రామగుండం ఎయిర్ పోర్టులకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయ్యిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హైదరాబాద్ - వరంగల్ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. నారపల్లి వరకు ఉన్న ఫ్లై ఓవర్  పనులు తర్వగా పూర్తి చేస్తామన్నారు కోమటిరెడ్డి. 

వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  ఓరుగల్లు అభివృద్ధికి రూ.4170 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు.  మంచినీటి సరఫరా వ్యవస్థల నిర్మాణాలు చేపడుతామన్నారు.  కేంద్రాన్ని ఒప్పించి మూమునూరు ఎయిర్ పోర్టును సాధించామన్నారు కోమటిరెడ్డి. మామునూరు ఎయిర్ పోర్టు విస్తరణకు  మరింత భూమి కావాలన్నారు. నవంబర్ 17న భూసేకరణకు జీవో రిలీజ్ చేశామన్నారు.  ఢిల్లీ,బెంగళూరు తరహాలో మామునూరు ఎయిర్ పోర్ట్ ను  డెవ్ లప్ చేస్తామన్నారు. ఇప్పటికే వరంగల్ లో  మెగా టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు.

ALSO READ | మామునూర్​ఎయిర్​పోర్ట్​భూసేకరణకు రూ.205కోట్లు రిలీజ్