నల్గొండ ప్రజలకు రుణపడి ఉంటాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • దేశంలోనే జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు 
  • మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి 

నల్గొండ అర్బన్,​ వెలుగు : నల్గొండ పార్లమెంట్ ​కాంగ్రెస్​అభ్యర్థి రఘువీర్ రెడ్డికి దేశంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన నల్గొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని రోడ్లు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలోని అనిశెట్టి దుప్పలపల్లిలో పార్లమెంట్​ ఎన్నికల కౌంటింగ్​ పూర్తయిన తర్వాత రఘువీర్​గెలుపు నియమాకపత్రాన్ని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలూనాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్​రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్​నాయక్​తో కలిసి అందుకున్నారు. 

తర్వాత మంత్రి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ మెజార్టీలో దేశంలోనే రఘువీర్​రెడ్డి టాప్–5లో ఉన్నారన్నారు. రఘువీర్ రెడ్డిని ​భారీ మెజార్టీతో గెలిపించి నల్గొండ జిల్లా ఖ్యాతిని దేశంలో నిలబెట్టారని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంత్రులు ఉత్తమ్ ​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. 1952లో ఇక్కడి నుంచి రావినారాయణరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రస్తుతం రఘువీర్ రెడ్డిని అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించారన్నారు.