సోషల్ మీడియావిమర్శలను పట్టించుకోను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సోషల్ మీడియావిమర్శలను పట్టించుకోను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై, తమ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.

 మంత్రిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం తప్ప.. ఇతర విషయాలపై దృష్టి పెట్టనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తాను కేబినెట్ గురించి ఆలోచించ లేదని, ఇప్పుడు కూడా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. గద్దర్ అవార్డుల అంశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చూస్తున్నారని తెలిపారు.