మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చదువుల తల్లికి అండగా ఉంటాని భరోసా ఇచ్చారు. ఇటలిలోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో) లో అర్కిటెక్చర్ కన్ స్ట్రక్షన్ లో మాస్టర్స్ లో సీటొచ్చినా.. వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని విద్యార్థిని ప్రణవి చొల్లేటి తన పరిస్థితిని మంత్రికి విన్నవించింది. విద్యార్థిని గురించి తెలుసుకుని చలించిపోయారు.వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చదువుకునేందుకు ఆర్ధిక సాయం అందించారు.
మంత్రి కోమటిరెడ్డి విద్యార్థిని ప్రణవి చొల్లేటిని ఇంటికి పిలిపించి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించి.. చదువుకు అండగా ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్ధి చదువు ఆగిపోతే.. వారి జీవితం ఆగిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు. ప్రతిభ కలిగిన ఏ విద్యార్ధి చదువు ఆగిపోకుడదని తెలిపిన ఆయన.. జీవితాలను మార్చే ఆయుధం చదువు ఒక్కటేనని..అయన అన్నారు.
Also Read :- ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో బీజేపీని గెలవనివ్వం
ప్రణవి చొల్లేటి కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు. వెంటనే వారిని పిలిపించుకుని మాట్లాడారు. ప్రతిభావంతురాలైన ప్రణవి చదువులకు ఆర్ధిక ఇబ్బందులు అడ్డుగా మారకూడదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రణవి చొల్లేటి చదువులకు కావల్సిన ఆర్ధిక సహాయం రూ. లక్ష రూపాయిలు అందించారు. ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాని భరోసా కల్పించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంతో అప్యాయంగా మాట్లాడారని, మేమేవరమో తెలియకపోయినా మా కష్టం తెలుసుకొన్నారు. మమ్మల్ని ఇంటికి పలిచి స్వీట్లు అందించి మర్యాద చేశారు. తన చదువులకు అండగా ఉంటానని చెప్పారని ప్రణవి చొల్లేటి భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెకు అప్పటికప్పుడే ఆర్ధిక సహాయం చేశారు. చేయడమే కాదు.. ఆమె చదువుల బాధ్యత తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. మంత్రి సాయంపై ప్రణవి సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి ఎందరో పేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడుతున్న మంత్రి కోమటిరెడ్డికి ప్రణవి కృతజ్ఞతలు తెలిపారు.