చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తుల ఆయనకు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం మంత్రి తన సొంత జిల్లా యాదాద్రి భువనగిరికి వెళ్లారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించి జిల్లాకు వచ్చిన ఆయనకు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మండలంలోని దండు మల్కాపూర్ ఆందోల్ మైసమ్మ దేవాలయానికి చేరుకుని.. అమ్మావారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.