ఛాయా సోమేశ్వరాలయం.. యునెస్కో గుర్తింపు కోసం కేంద్రానికి లేఖ రాస్తా: కోమటిరెడ్డి

ఛాయా సోమేశ్వరాలయం.. యునెస్కో గుర్తింపు కోసం కేంద్రానికి లేఖ రాస్తా: కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా :  ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు  కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.   మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా నల్గొండలోని ఛాయా, పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  దేశ, విదేశాల నుంచి నిపుణులు, ఆర్కియాలజీ వాళ్లు ఛాయాసోమేశ్వర ఆలయాన్ని పరిశీలించారని చెప్పారు.  ఇక్కడి  మహత్యం ఎవరికీ ఇంకా తెలియలేదని పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.  వచ్చే ఏడాదిలోగా ఈ శివాలయానికి  అన్నిసదుపాయాలు కల్పించి అభివృధ్ధి చేస్తానని చెప్పారు.  

మహిళలకు కుటుంబ భారం తగ్గించేలా ఉచిత కరెంటు, గ్యాస్‌ సబ్పడీ ఇస్తూ మహిళా పక్షపాతిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు  కోమటిరెడ్డి.  మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేసి వడ్డీలేని  రుణాలు ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు.