జిట్టాకు మంత్రి పరామర్శ 

యాదాద్రి, వెలుగు : తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జిట్టా సికింద్రాబాద్​లోని యశోద హాస్పిటల్​లో చికిత్స​ పొందుతున్న సంగతి తెలిసిందే.

విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి శనివారం హాస్పిటల్​కు వెళ్లి జిట్టాను పరామర్శించారు. అనంతరం జిట్టా సతీమణి సునీతతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి ఉన్నారు.