అమెరికాకు మంత్రి వెంకట్​రెడ్డి

అమెరికాకు మంత్రి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోమవారం అర్ధరాత్రి అమెరికా బయల్దేరి వెళ్లారు.  ఈ నెల 7వ తేదీన ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎన్ఆర్ఐ లీడర్లతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకానికి అధునాతన బేరింగ్ మెషినరీ సమకూర్చేందుకు 12న ఓహియో లోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈవో లాక్ హోమ్ తో సమావేశం కానున్నారు. ఈ నెల 14న సీఎంతో కలిసి తిరిగి మంత్రి హైదరాబాద్ వస్తారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.