సీఎం రేవంత్కు మంత్రి కోమటిరెడ్డి లేఖ..N కన్వెన్షన్పై హైడ్రా కొరడా

సీఎం రేవంత్కు మంత్రి కోమటిరెడ్డి లేఖ..N కన్వెన్షన్పై హైడ్రా కొరడా

హైదరాబాద్ మాదాపూర్లో N కన్వెన్షన్ లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది.  అయితే హీరో నాగార్జున N-కన్వెన్షన్ లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి... ఆగస్టు 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తుమ్మిడి కుంట చెరువులో FTLలో ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు లేఖలో వివరించారు కోమటిరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా అన్ని ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్...ఇవాళ కన్వెన్షన్ కు కూల్చివేయించారు. 

ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవు

ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని... భవిష్యత్ తరాల వారికి సంపదను కాపాడావలసిన అవసరం ఉందన్నారు. వాటి పరిరక్షణను చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు తామ పని తాము చేసుకుపోతున్నాయని, ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్చను ఇచ్చిందన్నారు మంత్రి జూపల్లి.

హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. ఉదయం 7 గంటల నుంచి మొదలైన కూల్చివేత పనులు 11 గంటల వరకు నాన్ స్టాప్ గా కొనసాగాయి. మొత్తం 6 భారీ మిషన్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువు భూమిని ఆక్రమించి.. నాగార్జున  N కన్వెన్షన్ నిర్మించారు. చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో హైడ్రా చర్యలు తీసుకుంటోంది. మూడున్నర ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ కట్టినట్టు నిర్దారణ అయ్యింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగాయి.