అధికారం లేక బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర అసహనం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అధికారం లేక బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర అసహనం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారం లేకపోవడంతో బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు అధికారం వస్తుందా అని ఎదురు చూస్తున్నారని, వాళ్లకే ఓపికే లేకుండా పోయిందని విమర్శించారు. పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని, విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా చేస్తే ప్రజల నుంచి వారికి వ్యతిరేకత ఎదురవడం ఖాయమన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తాము క్రియాశీలకంగా పని చేశామని, రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ బీ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డికి న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్) ఆఫీస్​ఎక్కడుందో తెలియదన్నారు. ఆయన ఆ శాఖ మంత్రిగా ఒక్కసారి కూడా ఆ ఆఫీస్‎కు వెళ్లలేదని విమర్శించారు.